IPL 2023: మామిడి పళ్లు తియ్యగా ఉన్నాయంటూ కోహ్లీని ఉద్దేశించి కవ్వించిన హక్, ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావని మండిపడుతున్న కోహ్లీ అభిమానులు

వరుస ఇన్‌స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్నారు

Naveen ul-Haq (Photo credit: Instagram)

అఫ్గనిస్తాన్ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ నవీన్‌- ఉల్‌- హక్‌ మరోసారి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిపై మాటలకు పని చెప్పాడు. వరుస ఇన్‌స్టా పోస్టులతో మరోసారి అగ్గిరాజుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు నవీన్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘చిల్లర వేషాలు మానుకోకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. మా కింగ్‌తో పెట్టుకుంటే నీకు దబిడి దిబిడే’’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- నవీన్‌ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో కూడా నవీన్‌.. కోహ్లితో అనుచితంగా ప్రవర్తించాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్‌ ఇచ్చాడు.

ముంబై ఇండియన్స్ విజయం, సూర్యకుమార్ తుఫానులో కొట్టుకుపోయిన రాయల్ చాలెంజర్ బెంగుళూరు ఆశలు, పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోకి చేరిన ముంబై

ఇంతలో లక్నో మెంటార్‌ గంభీర్‌ జోక్యం చేసుకోవడం.. గొడవ మరింత పెద్దదికావడం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ కోహ్లి, గంభీర్‌ల మ్యాచ్‌ ఫీజులో వందశాతం కోత విధించడంతో పాటు నవీన్‌కు కూడా ఫీజులో 50 శాతం తగ్గిస్తూ జరిమానా విధించింది. అయితే, ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి, నవీన్‌ ఉల్‌ హక్‌ సోషల్‌ మీడియా వేదికగా కూడా వార్‌కి దిగారు. పరస్పరం విమర్శించుకుంటూ పోస్టులతో హల్‌చల్‌ చేశారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫొటోను పంచుకున్న నవీన్‌.. మ్యాంగోస్‌ తియ్యగా ఉన్నాయంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.

IPL 2023: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు,

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి విఫలమైనప్పటికీ ఆర్సీబీ 199 పరుగులు స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. సూర్యకుమార్‌- వధేరా ఆర్సీబీ ఓటమిని ఖరారు చేసే క్రమంలో వాళ్లిద్దరు ఒకరికొకరు అభినందించుకుంటున్న ఫొటోను షేర్‌ చేసిన నవీన్‌.. ‘‘రౌండ్‌ 2.. ఇంత తియ్యటి మామిడి పండ్లను నేను ఎప్పుడూ తినలేదు.. సూపర్‌’’ అంటూ మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు. దీంతో కింగ్‌ కోహ్లి అభిమానులు అతడిపై విరుచుకుపడుతున్నారు.

‘‘ఎక్స్‌ట్రాలు చేస్తే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్‌.. జాగ్రత్త. నువ్వెంత.. నీ అనుభవం ఎంత? ముందు నీ ఆట గురించి నువ్వు చూసుకో.. తర్వాత ఇతరులపై రాళ్లు వేద్దువు గానీ’’ 23 ఏళ్ల నవీన్‌కు అని చురకలు అంటిస్తున్నారు. ఐపీఎల్‌-2023లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌లో కలిపి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్‌. ఇక నవీన్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. 4 ఇన్నింగ్స్‌లో 6.12 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.