ఐపీఎల్‌లో 50 ప్ల‌స్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఐపీఎల్‌లో అత్య‌ధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఫ‌స్ట్ ఉన్నాడు. ఇక కోహ్లీ త‌ర్వాత ఇండియ‌న్ల‌లో రెండ‌వ స్థానంలో ధావ‌న్ ఉన్నాడు. అత‌ను 49 సార్లు ఫిఫ్టీలు కొట్టాడు. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీల‌క ఇన్నింగ్స్ ఆడిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవ‌లం 49 బంతుల్లో అత‌ను 82 ర‌న్స్ చేశాడు.

Here's Update