IPL 2023: యశస్వీ జైశ్వాల్‌, రింకూ సింగ్‌ వచ్చే ప్రపంచకప్ ఆడాల్సిందే, వారిద్దరూ అద్బుతమైన ప్లేయర్లు అని కొనియాడిన భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్‌ కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Suresh raina

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌, కేకేఆర్‌ ఫినిషిర్‌ రింకూ సింగ్‌ జట్టును ముందుండి నడిపిస్తూ దూసుకుపోతున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్‌ కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ ఫీప్టి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌ 575 పరుగులు సాధించాడు.

ఫస్ట్ టైం చూస్తున్నా.. ఇదేమి బ్యాటింగ్ బాబోయ్, యశస్వీ జైశ్వాల్‌‌ను ఆకాశానికి ఎత్తేసిన విరాట్ కోహ్లీ, 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన జైశ్వాల్

ఇక రింకూ సింగ్‌ విషయానికి వస్తే.. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేకేఆర్‌కు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్‌.. 353 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌, రింకూ సింగ్‌ వన్డే ప్రపంచకప్‌-2023లో ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ డిజిటల్‌ బ్రాడ్‌కాస్టర్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రైనా..రాజస్తాన్‌, కేకేఆర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ వాఖ్యలు చేశాడు.