Dhoni on Ambati Rayudu: వీడియో ఇదిగో, రాయుడు అద్భుతమైన క్రికెటర్, అతడిని చూస్తే ఆనందంగా ఉందని ప్రశంసలు కురిపించిన ధోనీ
రాయుడు జట్టులో ఉన్నప్పుడు తానెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేదని.. అతడు త్వరగా రియాక్ట్ అవుతాడని ధోనీ సరదాగా చెప్పాడు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించిన ధోనీ.. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరఫున ఆడామని గుర్తు చేసుకున్నాడు.
గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాయుడికి ధోనీ అరుదైన గౌరవం కల్పించాడు. ట్రోఫీని అందుకునే సమయంలో.. తాను పక్కకు నిల్చొని రాయుడిని ట్రోఫీ అందుకోవాలని సూచించాడు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, జై షా చేతుల మీదుగా రాయుడు ట్రోఫీని అందుకున్నాడు. అంబటి రాయుడి పట్ల ధోనీకి ఉన్న గౌరవానికి, నమ్మకానికి ఈ ఘటనే నిదర్శనం.
రాయుడి గురించి ధోనీ మాట్లాడుతూ.. అతడు మైదానంలో ఉంటే నూటికి నూరు శాతం అంకితభావంతో ఆడతాడన్నాడు. రాయుడు జట్టులో ఉన్నప్పుడు తానెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేదని.. అతడు త్వరగా రియాక్ట్ అవుతాడని ధోనీ సరదాగా చెప్పాడు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించిన ధోనీ.. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరఫున ఆడామని గుర్తు చేసుకున్నాడు.
Video
స్పిన్, ఫాస్ట్ బౌలర్లను ఇద్దర్నీ రాయుడు సమర్థవంతంగా ఎదుర్కొంటాడన్న మహీ.. ఈ మ్యాచ్‌లో అతడు ఏదైనా స్పెషల్ చేస్తాడని భావించానని.. అతడిని చూస్తే ఆనందంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్‌ను రాయుడు చాలా కాలంపాటు గుర్తుంచుకుంటాడన్న ధోనీ.. రాయుడు కూడా తనలాగే ఫోన్‌ను ఎక్కువగా వాడడని చెప్పాడు.