IPL 2023: నువ్వు నీ చెత్త ఆట, గల్లీలో ఆడుకో పోయి, కీలక సమయంలో చేతులెత్తేసిన సమద్‌పై విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్‌ అభిమానులు

మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబై విసిరిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 178 పరుగులకు ఆలౌటైంది.

Samad (Photo-IPL)

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబై విసిరిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 178 పరుగులకు ఆలౌటైంది.

ఆఖరి 5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 60 పరుగులు కావాలి. ఈ సమయంలో సన్‌రైజర్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సమద్‌ 13 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక బౌండరీ మాత్రమే ఉంది. జట్టును గెలిపించాలన్న కనీస ప్రయత్నం అతడు చేయనట్లు సృష్టంగా కన్పించింది. అతడి కన్న ఆల్‌రౌండర్లు జానెసన్‌(13), సుందర్‌(10) 100 రెట్లు బెటర్‌. ఉన్న కాసేపు అయిన తమ వంతు న్యాయం చేశారు.

వీడియో ఇదిగో, తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించిన సచిన్ కొడుకు అర్జున్, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయని ముంబై ఇండియన్స్ యువపేసర్

ఇక ఆఖరి ఓవర్‌ వరకు క్రీజులో ఉన్న సమద్‌.. అవసరములేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన అబ్దుల్ సమద్ ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు మండిపడుతున్నారు. సమద్‌ వల్లే మ్యాచ్‌ ఓడిపోయింది అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నీ ఆటకు ఓ దండం అంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు.