IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ ఆక్షన్ లో ఏ జట్లు ఏ ప్లేయర్ ను కొనుగోలు చేశాయంటే? ఫుల్ లిస్ట్ ఇదుగోండి
మరో 30 మంది అసోసియేట్ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పది ఫ్రాంచైజీలకు 204 స్లాట్లు ఉన్నాయి. ఒక్కో జట్టుకు గరిష్టంగా 25 మంది సభ్యులను ఎంచుకున్న అవకాశం ఉంది.
Jedda, NOV 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – 2025 సీజన్ కోసం సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో ఆటగాళ్ల వేలం (IPL 2025 Auction) కొనసాగుతున్నది. ఐపీఐల్ లోని 10 ప్రాంఛైజీలు వచ్చే మూడేండ్లకు తమ జట్ల కూర్పులో పూర్తిగా నిమగ్నం అయ్యాయి. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఐపీఎల్ -2025 టోర్నీలో పాల్గొననున్నారు. వారిలో 1,165 మంది ఇండియర్ ప్లేయర్స్ (List Of Sold Players), 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 320 మంది ప్లేయర్లపై క్యాప్డ్, 1224 మంది ప్లేయర్లు అన్ క్యాప్డ్ గా ఉన్నారు. మరో 30 మంది అసోసియేట్ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పది ఫ్రాంచైజీలకు 204 స్లాట్లు ఉన్నాయి. ఒక్కో జట్టుకు గరిష్టంగా 25 మంది సభ్యులను ఎంచుకున్న అవకాశం ఉంది.
తొలి రోజు ఏయే జట్లు ఏ ఆటగాన్ని కొనుగోలు చేశాయంటే?
రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా అర్ష్ దీప్ సింగ్ ను రూ.18 కోట్లకు కొనుగోలుచేసిన పంజాబ్ కింగ్స్
రూ.10.75 కోట్లకు కగిసో రబడాను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్.
రూ.26.75 కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
రూ.15.75 కోట్లకు జాస్ బట్లర్ సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్.
రూ.11.75 కోట్లకు మిచెల్ స్టార్క్ ను కొన్న ఢిల్లీ క్యాపిటల్స్.
గరిష్టంగా రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.
రూ.10 కోట్లకు మహ్మద్ షమీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
రూ.7.5 కోట్లకు డేవిడ్ మిల్లర్ ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
రూ.18 కోట్లకు యుజ్వేంద్ర చాహల్ కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్.
రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతమైన మహ్మద్ సిరాజ్.
రూ.8.75 కోట్లకు లియాం లివింగ్‌స్టోన్‌ను ఎగరేసుకుపోయిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్.
రూ.14 కోట్లకు కేఎల్ రాహుల్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
రూ.6.25 కోట్లకు హర్రీ బ్రూక్ ను కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్.
రూ.2 కోట్లకు అడైన్ మాక్రంను కొన్న లక్నో సూపర్ జెయింట్స్.
రూ.6.25 కోట్లకు డేవోన్ కాన్వేను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.
రూ.3 కోట్లకు రాహుల్ త్రిపాఠిని కొనుక్కున్న చెన్నై సూపర్ కింగ్స్.
ఆర్టీఎం ద్వారా జాక్ ఫ్రాజర్ మైక్ గుర్క్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.
రూ.8 కోట్లకు హర్ష పటేల్ ను గెలుచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
ఆర్టీఎం ద్వారా రూ.4 కోట్లకు రచిన్ రవిచంద్రను కొన్న చెన్న సూపర్ కింగ్స్.
రూ.9.75 కోట్లకు రవిచంద్రన్ అశ్విన్‌ను సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.
రూ.23.75 కోట్లకు వెంకటేశ్ అయ్యర్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.
రూ.11 కోట్లకు మార్కస్ స్టోయినిన్స్‌ను గెలుచుకున్న పంజాబ్ కింగ్స్.
రూ.3.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం మిచెల్ మార్ష్.
రూ.4.2 కోట్లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.
రూ.3.6 కోట్లకు క్వింటాన్ డీకాక్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.
రూ.11.50 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం ఫిల్ సాల్ట్.
రూ.2 కోట్లకు రహ్మానుల్లా గుర్బేజ్ ను సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.
రూ.11.25 కోట్లకు ఇషాన్ కిషన్ ను కొనుక్కున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
రూ.4 కోట్లకు ఆర్సీబీకి జితేష్ శర్మ సొంతం.
రూ.12.5 కోట్లకు జోష్ హెజిల్ వుడ్ ను కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్ ఆఫ్ బెంగళూర్.
రూ.9.5 కోట్లకు ప్రసీద్ కృష్ణను ఎగరేసుకుపోయిన గుజరాత్ టైటాన్స్.
రూ.9.75 కోట్లకు అవేశ్ ఖాన్ ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
రూ.6.5 కోట్లకు ఆండ్రే నార్ట్‌జీని కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్.
రూ.12.50 కోట్లకు జోఫ్రా ఆర్చర్ ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్.