IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు

కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

Sunil Gavaskar (Photo Credits: Instagram)

ఇంగ్లండ్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్‌ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్‌.. ఎంఐ కేప్‌టౌన్‌ జట్టుకు ఆడాడు.

ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

ఈ క్రమంలో ఐపీఎల్‌-2023 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు.ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ జోఫ్రా ఆర్చర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.