Irfan Pathan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్, టెస్టుల్లో తొలి ఓవర్‌లోనే హ్యట్రిక్ తీసిన రికార్డు ఇప్పటికీ పదిలమే, 2007 T20 ప్రపంచకప్పు భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పఠాన్

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు (Irfan Pathan Retires) ఇర్ఫాన్ పఠాన్ స్పష్టంచేశాడు. 2003లో 19 ఏళ్ల వయస్సులో టీమ్ ఇండియాలోకి వచ్చిన ఇర్ఫాన్.. తన కెరీర్‌లో టీమిండియా తరపున మొత్తం 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Irfan Pathan Retires (Photo Credits: Getty Images)

Mumabi, January 04: టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు (Irfan Pathan Retires) ఇర్ఫాన్ పఠాన్ స్పష్టంచేశాడు. 2003లో 19 ఏళ్ల వయస్సులో టీమ్ ఇండియాలోకి వచ్చిన ఇర్ఫాన్.. తన కెరీర్‌లో టీమిండియా తరపున మొత్తం 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టీమిండియా తరపున ఆడిన మొత్తం మ్యాచ్‌‌ల్లో ఇర్ఫాన్ 301 వికెట్లు తీసుకున్నాడు. కాగా 2012లో చివరిసారిగా భారత్ తరపున ఆడిన పఠాన్.. దేశవాళీల్లోనూ గతేడాదే చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి తన సొంతజట్టు బరోడాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌ (India)తరపున తొమ్మిదేళ్లపాటు ఇర్ఫాన్ ప్రాతినిథ్యం వహించాడు.

Irfan Pathan Hat-trick vs Pakistan

2006లో పాక్ (Pakistan)గడ్డపై టెస్టు మ్యాచ్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసి సంచలనంగా మారాడు. అంతే కాకుండా ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే భారత్ 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో 16 పరుగులిచ్చి కీలక మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత్ వరల్డ్ తొలిసారిగా టీ20 కప్పును గెలుచుకుంది.

Irfan Pathan Great Bowling in Famous Perth Test Vs Australia 2008

గ్రెగ్ చాపెల్ టీం ఇండియా కోచ్ గా ఉన్న సమయంలో ఇర్పాన్ పఠాన్‌ను పించ్ హిట్టర్‌గా బరిలోకి దింపి ప్రయోగాలు చేసిన విషయం క్రికెట్ ప్రేమికులు గుర్తు ఉండే ఉంటుంది. బ్యాటింగ్ లో కూడా ఇర్ఫాన్ ఫరవాలేదనిపించాడని చెప్పవచ్చు. టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 రన్స్ సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం యువరాజ్ సింగ్‌‌లాగా విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశముంది.