James Anderson Retirement: టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్, 700 వికెట్లు ప‌డ‌గొట్టిన ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్సన్ ఇక టెస్టు క్రికెట్ కు దూరం

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌ వేదికగా జులై 10న టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో 41 ఏళ్ల అండర్సన్ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు (Retirement) పలకనున్నాడు.

James Anderson (Photo credit: Instagram @jimmya9)

New Delhi, May 11: ఇంగ్లాండ్ స్టార్‌ పేసర్ జేమ్స్ అండర్సన్‌ (James Anderson) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌ వేదికగా జులై 10న టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో 41 ఏళ్ల అండర్సన్ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు (Retirement) పలకనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో అండర్సన్ పోస్టు పెట్టాడు. ఆట నుంచి తప్పుకోవడం బాధగా ఉందని, అయితే వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. కుటుంబసభ్యులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌ల సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నానని, ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.

 

 

View this post on Instagram

 

A post shared by James Anderson (@jimmya9)

సుదీర్ఘ ఫార్మాట్‌లో అండర్సన్‌ (James Anderson Retirement) మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 187 టెస్టులు ఆడి 700 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 700 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. టెస్టుల్లో 700 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన అండర్సన్‌.. తొలి పేసర్‌గా నిలవడం విశేషం. అంతకుముందు ముత్తయ్య మురళీధరన్ 800, షేన్ వార్న్ 709 వికెట్లతో ముందున్నారు. ఈ వెటరన్ పేసర్ తొలిసారి 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది టెస్టుల్లోకి అడుగుపెట్టిన అండర్సన్ 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.