RR vs RCB Qualifier: ఈసారి కూడా బెంగళూరుకు నిరాశే, ఫైనల్‌కు చేరిన రాజస్థాన్, జోస్‌ బట్లర్ అజేయ సెంచరీతో రాజస్థాన్‌లో జోష్, ఆదివారం గుజరాత్‌తో ఢీకొట్టనున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

Mumbai, May 27: రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ (Rajasthan) ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.దాంతో బెంగళూరు (bengaluru) జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ (106 నాటౌట్) (Jos Buttler) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది.

బట్లర్‌కు యశస్వి జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23) మంచి సహకారం అందించారు. దేవదత్ పడిక్కల్ (9) నిరాశ పరిచినా కూడా.. హెట్మెయర్ (2 నాటౌట్)తో కలిసి బట్లర్ లాంఛనం పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హసరంగ ఒక వికెట్ తీసుకున్నాడు. 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరిన రాజస్థాన్.. మరోసారి గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఆదివారం మొతేరా స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.

IPL 2022: విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ మాములుగా లేదుగా, గాల్లోకి ఎగురుతూ ప్రేక్షకులవైపు చూస్తూ పెద్దగా అరిచిన కోహ్లీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

ఫైనల్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన క్వాలిఫయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. రాజస్తాన్ రాయల్స్ ముందు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్‌ మరోసారి రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఫామ్ నిరూపించుకున్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాటిదార్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు.

IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బెంగుళూరు, అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా రికార్డు, లక్నో సూపర్‌జెయింట్స్‌పై అద్భుత విషయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు  

అయితే, మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (7) మరోసారి విఫలం కాగా, కెప్టెన్ డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 24 పరుగులు పర్లేదనిపించారు. లోమ్రోర్ 8, దినేశ్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టిషాక్‌ తగిలింది. విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి వికెట్‌ కీపర్ సంజూ శాంసన్‌కు చిక్కాడు. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన రాజస్తాన్.. ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు ఫైనల్‌ బెర్తు కోసం తలపడ్డాయి.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif