Kagiso Rabada: అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కగిసొ రబాడ రికార్డు, పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ రికార్డు బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా పేస్ బౌలర్
తన టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసొ రబాడ టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. తన టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం వికెట్ తీయడం ద్వారా దక్షిణాఫ్రికా పేసర్ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ (12,602 బంతుల్లో) పేరిట ఉండేది. 2015లో టెస్టు అరంగేట్రం చేసిన రబాడ ఇప్పటివరకు 65 టెస్టులు ఆడాడు. ఇందులో 302 వికెట్లు తీశాడు.
అతితక్కువ బంతుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా
కగిసో రబడ (సౌతాఫ్రికా )*-11,817 బంతులు
వకార్ యూనిస్ (పాకిస్థాన్)-12,602 బంతులు
డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా )- 12,605 బంతులు
అలెన్ డొనాల్డ్ (సౌతాఫ్రికా )-13,672 బంతులు
దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
డేల్ స్టెయిన్ (93 మ్యాచ్ లు) -439 వికెట్లు
షాన్ పొలాక్ (108 మ్యాచ్ లు)- 421 వికెట్లు
మఖాయ ఎన్తిని (101 మ్యాచ్ లు)- 390 వికెట్లు
అలన్ డొనాల్డ్ (72 మ్యాచ్ లు)- 330 వికెట్లు
మోర్నీ మోర్కెల్ (86 మ్యాచ్ లు)-309 వికెట్లు
కగిసొ రబడ (65 మ్యాచ్ లు) - 302* వికెట్లు