World Cup 2023: వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం, బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్
ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది.
వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది.చెన్నైలోని చెపాక్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా..నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ 2, లాకీ ఫెర్గూసన్ 3, సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో 42.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసిన కివీస్ 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. లాకీ ఫెర్గూసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అడుగుపెట్టిన కేన్ మామ.. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 67 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.