CSK Vs KKR: చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైకి ఓటమి, సొంత గ్రౌండ్‌లో సీఎస్‌కేకు పరాభవం, ఆరు వికెట్ల తేడాలో KKR ఘనవిజయం
లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపొందింది.
Chennai, May 15: చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించింది. లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపొందింది. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను రింకూ సింగ్(Rinku singh) (54; 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), నితీశ్ రాణా (Nitish Rana)(57నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధశతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. జేసన్ రాయ్(12), రహ్మానుల్లా గుర్బాజ్(1), వెంకటేశ్ అయ్యర్(9) లు విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైను శివమ్ దూబే(48 నాటౌట్; 34 బంతుల్లో 1 ఫోర్, 3సిక్సర్లు) ఆదుకున్నాడు.
మిగిలిన వారిలో డెవాన్ కాన్వే(30; 28 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించగా రుతురాజ్ గైక్వాడ్(17), అజింక్యా రహానే(16), అంబటి రాయుడు(4), మొయిన్ అలీ(1) లు విఫలం అయ్యారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా ఒక్కొ వికెట్ పడగొట్టారు.