Anshuman Gaekwad: క్యాన్సర్‌తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్‌గా,సెలక్టర్‌గా రికార్డ్స్ ఇవే

క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Legendary cricketer Anshuman Gaekwad is no more, PM Modi Pays tributes (X)

Delhi, Aug 1: భారత లెజండరీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ ఇకలేరు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. భారత జట్టు కోచ్‌గా , ఆ తర్వాత జాతీయ సెలక్టర్‌గా పనిచేశారు గైక్వాడ్. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. కోచ్‌గా గైక్వాడ్ కెరీర్‌లో మర్చిపోలేని విషయం. 1998లో షార్జాలో మరియు ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 1999లో పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్‌కు గైక్వాడ్ చేసిన కృషి మర్చిపోలేమని, అద్భుత ఆటగాడని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోచ్‌గా అద్భుత సేవలు అందించారని..గైక్వాడ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా గైక్వాడ్‌కు నివాళి అర్పించారు.   భార‌త్-శ్రీ‌లంక వ‌న్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్క‌డ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంత‌కీ సిరీస్ ఎప్ప‌టి నుంచి అంటే?

భారత్ తరపున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. వెస్టిండీస్‌పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 1987లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడారు.70 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 30.07 సగటుతో 1985 పరుగులు చేయగా ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు.

Here's Tweet:



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif