LSG Vs KKR: మళ్లీ రఫ్పాడించిన రింకూ సింగ్, అయినా పోరాడి ఓడిన కోల్‌కతా, ఒక్క పరుగు తేడాతో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన లక్నో సూపర్ జెయింట్స్
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో లక్నో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Lucknow, May 20: లక్నోసూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సాధించింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో లక్నో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్(Rinku Singh) (67 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆఖరి వరకు పోరాడాడు. మిగిలిన వారిలో జేసన్ రాయ్(45; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా వెంకటేశ్ అయ్యర్(24) పర్వాలేదనిపించాడు.
నితీశ్ రాణా(8), రెహ్మనుల్లా గుర్భాజ్(10), ఆండ్రీ రస్సెల్(7)లు విపలం అయ్యారు. లక్నో బౌలర్లలో రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీయగా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, ఒక్కొ వికెట్ పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా, క్వింటన్ డికాక్(28), ప్రేరక్ మన్కడ్(26), ఆయుష్ బదోని(25) లు ఫర్వాలేదనిపించారు. కరన్ శర్మ(3), మార్కస్ స్టోయినిస్(0), కెప్టెన్ కృనాల్ పాండ్యా(9)లు విఫలం అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా లు తలా రెండు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.