MI vs PBKS, IPL 2021: అతి కష్టం మీద గెలిచిన ముంబై, వరుస పరాజయాలకు చెక్, 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన రోహిత్ సేన

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs PBKS, IPL 2021 ) ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని (MI vs PBKS Result) అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో చేధించింది.

Mumbai Indians (Photo Credits: Twitter/IPL)

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs PBKS, IPL 2021 ) ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని (MI vs PBKS Result) అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో చేధించింది. హార్దిక్‌ పాండ్యా తొలిసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.

30 బంతుల్లో 40 పరుగులు చేసిన పాండ్యా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. పొలార్డ్‌ 15 పరుగులతో హార్ధిక్‌కు సహకరించాడు. అంతకముందు సౌరబ్‌ తివారి 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయి 2, షమీ, నాథన్‌ ఎలిస్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్‌ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్‌ మక్రమ్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్‌, రాహుల్‌ చహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ మెరుపులు, హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ మ్యాజిక్, ముంబైపై విజయంతో ప్లేఆఫ్స్‌ రేసుకు మరింత చేరువైన కోహ్లీ సేన

స్కోరుబోర్డు

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 21; మన్‌దీప్‌ (ఎల్బీ) క్రునాల్‌ 15; గేల్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 1; మార్‌క్రమ్‌ (బి) చాహర్‌ 42; పూరన్‌ (ఎల్బీ) బుమ్రా 2; హూడా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 28; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 14; ఎల్లిస్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 135/6; వికెట్ల పతనం: 1-36, 2-39, 3-41, 4-48, 5-109, 6-123; బౌలింగ్‌: క్రునాల్‌ 4-0-24-1; బౌల్ట్‌ 3-0-30-0; బుమ్రా 4-0-24-2; కుల్టర్‌నైల్‌ 4-0-19-0; పొలార్డ్‌ 1-0-8-2; రాహుల్‌ చాహర్‌ 4-0-27-1.

ముంబై: రోహిత్‌ (సి) మన్‌దీప్‌ (బి) బిష్ణోయ్‌ 8; డికాక్‌ (బి) షమి 27; సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 0; సౌరభ్‌ తివారి (సి) రాహుల్‌ (బి) ఎల్లిస్‌ 45; హార్దిక్‌ (నాటౌట్‌) 40; పొలార్డ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19 ఓవర్లలో 137/4; వికెట్ల పతనం: 1-16, 2-16, 3-61, 4-92; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 3-0-18-0, షమి 4-0-42-1, హర్షదీప్‌ 4-0-29-0, రవి బిష్ణోయ్‌ 4-0-25-2, ఎల్లిస్‌ 3-0-12-1, హర్‌ప్రీత్‌ 1-0-11-0