IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

Sunrisers Hyderabad (Twitter/IPL)

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టుకు శుభారంభాన్నివ్వగా.. టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రైజర్స్‌ను భయపెట్టాడు. ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో ముంబైని గెలిపించినంత పనిచేసిన డేవిడ్‌ రనౌట్‌ కావడంతో హైదరాబాద్‌ ఊపిరి పీల్చుకుంది. మన బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. త్రిపాఠికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం కోల్‌కతాతో లక్నో తలపడనుంది.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం