Complainant on Mitchell Marsh : వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టినందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ పై కేసు నమోదు, 140 కోట్లమంది భారతీయులను అవమానించారంటూ ఫిర్యాదు
మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్ అలీగఢ్ (Aligarh) పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Aligarh, NOV 24: వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (World Cup trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించి.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) చిక్కుల్లో పడ్డారు. ఆతడిపై భారత్ (India)లో కేసు నమోదైంది. ఇటీవలే భారత్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. అంతే కాదు చేతిలో బీరు బాటిల్ కూడా పట్టుకున్నాడు. ఈ ఫొటో బైటకు రావడంతో అతడిపై క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచకప్‌ను ఎంతో గొప్పగా భావించే వారంతా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంత అహంకారమా అంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (UP)కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్ ( RTI activist Pandit Keshav).. మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్ అలీగఢ్ (Aligarh) పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.