IPL 2022: మళ్లీ చెలరేగిన మిచెల్ మార్ష్, సాయం చేసిన డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ ఘనవిజయం, సాహో మిచెల్ అంటున్న ఫ్యాన్స్

రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh)విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు

Mumbai, May 11; ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh)విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మార్ష్ 62 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. వార్నర్ 41 (David Warner) బంతుల్లో 52 పరుగులు(నాటౌట్) చేశాడు. అతడి స్కోర్ లో 1 సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ మిగతా బ్యాటర్లలో ఓపెనర్ శ్రీకర్‌ భరత్ (0) డకౌట్‌ కాగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (4 బంతుల్లో 13 పరుగులు..2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ (Chahal)తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్‌ ముందట భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది ఢిల్లీ. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారనప్పటికీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.