MI Vs KKR: కోల్‌కతాకు వరుస ఓటములు, ముంబై టీమ్‌లో చెలరేగిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సెంచరీ చేసినా గట్టెక్కించలేకపోయిన అయ్యర్
ఢిల్లీపై చివరి బంతి వరకు పోరాడి గెలిచిన ముంబయి.. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్ (104) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
Mumbai, April 16: ఐపీఎల్-16లో ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) వరుసగా రెండో విజయం. ఢిల్లీపై చివరి బంతి వరకు పోరాడి గెలిచిన ముంబయి.. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్ (104) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ముంబయి 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (58) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30) టిమ్ డేవిడ్ (24*) రోహిత్ శర్మ (20) సహకారం అందించడంతో ముంబయి సులభంగా విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా, ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకు ముందు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (104) శతక్కొట్టాడు. ఆండ్రూ రస్సెల్ (21) చివర్లో మెరుపులు మెరిపించాడు. శార్దూల్ ఠాకూర్ (13), రింకు సింగ్ (18) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు, కామెరూన్ గ్రీన్, డ్యూన్ జాన్‌సెన్, పీయూష్ చావ్లా, మెరిడిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.