PAK Vs HK Asia Cup 2022: సూపర్-4కు పాకిస్తాన్.. హాంకాంగ్ పై 156 పరుగుల తేడాతో ఘన విజయం
హాంకాంగ్ బ్యాటర్లలో ఏ ఒక్కరి స్కోరు డబుల్ డిజిట్ కి చేరకపోవడం గమనార్హం.
New Delhi, September 3: ఆసియా కప్‌లో (Asia Cup) భాగంగా పాకిస్తాన్ (Pakisthan) జట్టు సూపర్-4లోకి (Super-4) ప్రవేశించింది. శుక్రవారం హాంకాంగ్ (Hongkong) తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ను పాక్ బౌలర్లు వణికించారు. ఏ దశలోనూ పోరాడలేకపోయిన హాంకాంగ్ 38 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. హాంకాంగ్ బ్యాటర్లలో ఏ ఒక్కరి స్కోరు డబుల్ డిజిట్ కి (Double Digit) చేరకపోవడం గమనార్హం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు.
రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్, మోకాలి గాయంతో టోర్నమెంట్‌కు దూరమయిన రవీంద్ర జడేజా
అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక గ్రూఫ్-ఏ నుంచి ఏ-2గా సూపర్-4లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు.. ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడనుంది.