PBKS vs DC, IPL 2021: ఆరు విజయాలతో ఢిల్లీ ధనాధన్, తాజాగా 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్,సెంచరీకి పరుగు దూరంలో నిలిచిన మయాంక్‌ అగర్వాల్‌

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (PBKS vs DC, IPL 2021 Stat Highlights) ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది.

Shikhar Dhawan (Photo Credits; Twitter/IPL)

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ఖాతాలో ఆరో విజయాన్ని చేర్చుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (PBKS vs DC, IPL 2021 Stat Highlights) ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) (58 బంతుల్లో 99 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) (47 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో అర్ధ శతకాన్ని సాధించాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఛేదనలో ఢిల్లీ ఎక్కడా తడబడలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా జట్టుకు మరోసారి శుభారంభం చేశారు. వీరిద్దరి దూకుడుతో పవర్‌ప్లేలో ఢిల్లీ 63/0గా నిలిచింది. హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో పృథ్వీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం స్మిత్‌ (24)తో ధావన్‌ జట్టును లక్ష్యం వైపునకు నడిపించాడు. చివర్లో స్మిత్‌ అవుటైనా... 18వ ఓవర్లో 6, 6, 4 కొట్టిన హెట్‌మైర్‌ (4 బంతుల్లో 16 నాటౌట్‌) ఢిల్లీకి విజయాన్ని ఖాయం చేశాడు.

పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్..విలవిలలాడిన చెన్నై బౌలర్లు, 4వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ధోనీ సేనను గెలిపించలేని అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్‌

స్కోరు వివరాలు, పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) స్మిత్‌ (బి) రబడ 12; మయాంక్‌ (నాటౌట్‌) 99; గేల్‌ (బి) రబడ 13; మలాన్‌ (బి) అక్షర్‌ 26; హుడా (రనౌట్‌) 1; షారుఖ్‌ (సి) హెట్‌ మైర్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 4; జోర్డాన్‌ (సి) లలిత్‌ (బి) రబడ 2; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166.

వికెట్ల పతనం: 1–17, 2–35, 3–87, 4–88, 5–129, 6–143.

బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 4–1–37–0, స్టొయినిస్‌ 1–0–6–0, రబడ 4–0–36–3, అవేశ్‌ ఖాన్‌ 4–0–39–1, లలిత్‌ 3–0–25–0, అక్షర్‌ పటేల్‌ 4–0–21–1.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) హర్‌ప్రీత్‌ 39; ధావన్‌ (నాటౌట్‌) 69; స్మిత్‌ (సి) మలాన్‌ (బి) మెరిడిత్‌ 25; పంత్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 14; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–63, 2–111, 3–147.

బౌలింగ్‌: మెరిడిత్‌ 3.4–0–36–1, షమీ 3–0–37–0, బిష్ణోయ్‌ 4–0–42–0, జోర్డాన్‌ 2–0–21–1, హర్‌ప్రీత్‌ 3–0–19–1, దీపక్‌ హుడా 2–0–11–0.