MI vs CSK, IPL 2021: పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్..విలవిలలాడిన చెన్నై బౌలర్లు, 4వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ధోనీ సేనను గెలిపించలేని అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్‌
Kieron Pollard (Photo Credits: Twitter/IPL)

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పొలార్డ్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) ఒంటి చేత్తో ముంబై ఇండియన్స్‌కు అద్భుత విజయాన్నందించాడు. అతడి (Kieron Pollard) ఆటతీరుతో 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి 4వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై (Chennai Super Kings) 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (Ambati Rayudu) (27 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ చేశారు.

మొయిన్‌ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పొలార్డ్‌ (34 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చగా, కృనాల్‌ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగుల భారీస్కోరు సాధించింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 నాటౌట్‌), మొయిన్‌ అలీ (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58), డుప్లెసి (28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు. పొలార్డ్‌కు 2వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. సామ్‌ కర్రాన్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పొలార్డ్‌ నిలిచాడు.

స్పిన్నర్ హర్‌ప్రీత్‌ దెబ్బకు కోహ్లీ సేన విలవిల, 34 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి (Mumbai Indians) శుభారంభం లభించింది. ఓపెనర్లు డి కాక్, రోహిత్‌ చకచకా పరుగులు సాధించారు. దీపక్‌ చహర్‌ వేసిన మూడో ఓవర్లో రోహిత్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, డి కాక్‌ ఒక సిక్స్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. స్యామ్‌ కరన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్‌ మళ్లీ రెండు వరుస బౌండరీలు బాదాడు. పవర్‌ప్లేలో ముంబై 58 పరుగులు సాధించింది. అయితే 11 పరుగుల వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్‌ (3), డి కాక్‌లను అవుట్‌ చేసి చెన్నై పైచేయి సాధించింది. గెలుపు కోసం 62 బంతుల్లో 138 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై నిలిచింది.

గెలుపు బాధ్యతను తీసుకున్న ముంబై బ్యాట్స్‌మన్‌ పొలార్డ్‌ తనదైన తరహాలో చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన అతను ఇన్‌గిడి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. శార్దుల్‌ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అతనికి మరో ఎండ్‌లో కృనాల్‌ నుంచి తగిన సహకారం లభించింది. ఇన్‌గిడి ఓవర్లో కృనాల్‌ 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో ముంబై గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే స్యామ్‌ కరన్‌ చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని (44 బంతుల్లో 89 పరుగులు) విడదీయడంతో సీఎస్‌కే ఊపిరి పీల్చుకుంది. అయితే చివరి వరకు నిలబడిన పొలార్డ్‌ జట్టును గెలిపించాడు.

స్కోరు వివరాలు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 4; డు ప్లెసిస్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 50; అలీ (సి) డి కాక్‌ (బి) బుమ్రా 58; రైనా (సి) కృనాల్‌ (బి) పొలార్డ్‌ 2; రాయుడు (నాటౌట్‌) 72; జడేజా (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 218.

వికెట్ల పతనం: 1–4, 2–112, 3–116, 4–116.

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–42–1, ధావల్‌ 4–0–48–0, బుమ్రా 4–0–56–1, రాహుల్‌ చహర్‌ 4–0–32–0, నీషమ్‌ 2–0–26–0, పొలార్డ్‌ 2–0–12–2.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డి కాక్‌ (సి అండ్‌ బి) అలీ 38; రోహిత్‌ (సి) రుతురాజ్‌ (బి) శార్దుల్‌ 35; సూర్యకుమార్‌ (సి) ధోని (బి) జడేజా 3; కృనాల్‌ (ఎల్బీ) (బి) కరన్‌ 32; పొలార్డ్‌ (నాటౌట్‌) 87; హార్దిక్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) కరన్‌ 16; నీషమ్‌ (సి) శార్దుల్‌ (బి) కరన్‌ 0; ధావల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219.

వికెట్ల పతనం: 1–71, 2–77, 3–81, 4–170, 5–202, 6–203.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–37–0, స్యామ్‌ కరన్‌ 4–0–34–3, ఇన్‌గిడి 4–0–62–0, శార్దుల్‌ 4–0–56–1, జడేజా 3–0–29–1, మొయిన్‌ అలీ 1–0–1–1.