PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియన్ సీనియర్ ఆటగాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీలక నిర్ణయం
ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు
Lahore, AUG 08: పాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు. ఈ పరిచయంతోనే గిలెస్పీ నీల్సన్ పేరును ప్రతిపాదించాడు.
గిలెస్పీ, నీల్సన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌తో బాధ్యతలు చేపడతారు. ఈనెల 21 నుంచి బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్, పాక్‌లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఆగస్ట్ 21 నుంచి 25 వరకు రావల్పిండి వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.