Champions Trophy in Pakistan: పాకిస్తాన్ గడ్డ మీద టీమిండియా కాలు పెడుతుందా? ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ వేదికలను ఖరారు చేసిన పాకిస్తాన్

తాజాగా టోర్నీ వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. క‌రాచీ, లాహోర్, రావ‌ల్పిండిలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని సోమ‌వారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించింది

India vs Pakistan

ప్ర‌తిష్ఠాత్మ‌క చాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy 2025) హ‌క్కులు ద‌క్కించుకున్న పాక్.. తాజాగా టోర్నీ వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. క‌రాచీ, లాహోర్, రావ‌ల్పిండిలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని సోమ‌వారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించింది. చివ‌రిసారిగా 2017లో నిర్వ‌హించిన‌ చాంపియ‌న్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ వేదికైంది. ఈసారి ఆతిథ్య హ‌క్కుల‌ను పాక్ ద‌క్కించుకుంది.

అయితే.. ఆసియా క‌ప్(Asia Cup 2023) స‌మ‌యంలోనే భ‌ద్ర‌తా కార‌ణాల‌తో పాక్‌లో ఆడ‌మ‌ని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. దాంతో, మ‌రోదారి లేక హైబ్రిడ్ మోడ‌ల్‌ (Hybrid Model)లో టోర్నీని నిర్వ‌హించారు. అయితే.. భార‌త్ ఆతిథ్య‌మిచ్చిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్ జ‌ట్టు ఆడింది. దాంతో, మేము మా జ‌ట్టును పంపాం కాబట్టి ఈసారి బీసీసీఐ కూడా త‌మ జ‌ట్టును మా దేశానికి పంపాలి అని పీసీబీ వాదిస్తోంది.ఈ విష‌యంపై బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా మాత్రం ఇంకా స్పందించ‌లేదు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చిలో చాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రుగ‌నుంది.  ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన పాట్ కమిన్స్, వీడియో ఇదిగో..

ఈ మెగా టోర్నీ కంటే ముందు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్, పాక్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ్యాచ్ కోట్లాది మంది ఫ్యాన్స్‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్ట‌నుంది.