WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్, గెలిస్తే రూ. 13. 2 కోట్లు, ఓడిన జట్టుకు రూ. 6.61 కోట్లు, డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి.

ICC (Photo-ANI)

డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి. ఈ డబ్ల్యూటీసీ సీజన్‌ సైతం గత సీజన్‌లో లాగే 3.8 మిలియన్‌ డాలర్ల పర్స్‌ విలువ కలిగి ఉంది.

రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం

తొలి స్థానంలో నిలిచే జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు 800,000 డాలర్లు​, మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు, ఐదో ప్లేస్‌లో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు, ఆ తర్వాత ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ షేర్‌ చేయబడుతుంది.