IPL 2022, PBKS vs GT: ఉత్కంఠపోరులో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ, చివరి రెండుబాల్స్ సిక్స్‌లు కొట్టిన తెవాటియా, లాస్ట్ ఓవర్‌లో మలుపుతిరిగిన మ్యాచ్, వరుస విక్టరీలతో జోష్‌లో గుజరాత్
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. లాస్ట్ రెండు బాల్స్ సిక్స్ లు కొట్టి గుజరాత్‌కు సూపర్ విక్టరీ అందించాడు తెవాటియా. గుజరాత్ గెలవాలంటే చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా వరుసగా సిక్సర్లు బాది గుజరాత్‌ను గెలిపించాడు.
Mumbai, April 09: ఐపీఎల్‌లో (IPL) సూపర్ మజా వచ్చే మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab kings) మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. లాస్ట్ రెండు బాల్స్ సిక్స్ లు కొట్టి గుజరాత్‌కు సూపర్ విక్టరీ అందించాడు తెవాటియా (Tewatia). గుజరాత్ గెలవాలంటే చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13) వరుసగా సిక్సర్లు బాది గుజరాత్‌ను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌కు (Gujarat) థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ జట్టు లియామ్ లివింగ్‌స్టన్ (64), జితేష్ శర్మ (23), ధవన్ (35), రాహుల్ చాహర్ (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్ (96) (Shubhmann Gill) విజయానికి చేరువ చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను 19వ ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. ఆ ఓవర్లో గుజరాత్ గెలవాలంటే ఇంకా 19 పరుగులు కావలసి ఉంది. ఇలాంటి సమయంలో మిల్లర్ ఫోర్ కొట్టగా.. ఆ తర్వాతి బంతికి బౌలర్ ఒడియన్ స్మిత్ అనవసర తప్పిదంతో సింగిల్ వచ్చింది. దీంతో గుజరాత్ గెలవాలంటే చివరి రెండు బంతులకు 12 పరుగులు అవసరమయ్యాయి.
ఇలాంటి సమయంలో బ్యాటింగ్ చేసిన తెవాటియా.. చివరి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు బాది జట్టుకు విజయాన్నందించాడు. అభిమానులకు టీ20 క్రికెట్‌లోని థ్రిల్ చూపించాడు. దీంతో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, చాహర్ 1 వికెట్ తీసుకున్నారు. గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది.