వరుస ఓటములతో నిరాశలో కూరకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున పంత్‌కు 12 లక్షల రూపాయల ఫైన్‌ విధించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఈ సీజన్‌లో ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసిన మొదటి తప్పిదం కాబట్టి.. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టినట్లు ఐపీఎల్‌ పేర్కొంది.

ఐపీఎల్‌ గత మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు మరోసారి రిపీట్‌ చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పెడతారు. మూడోసారి కూడా అదే పునరావృతమైతే.. కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)