IPL 2023: ఆర్సీబీని వెంటాడుతున్న కష్టాలు, ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు, మడమ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌

ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్‌.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.

RCB players celebrate (Photo Credits: Twitter)

ఐపీఎల్‌-2023 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి.ఇప్పటికే ఆర్‌సీబీ పేసర్‌ హాజెల్‌వుడ్‌ గాయంతో బాధపడుతుండగా.. తొలి మ్యాచ్‌లో పేసర్‌ టోప్లే కూడా తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. తాజాగా ఆ జట్టు కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్‌.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.

రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, పాయింట్‌లో డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రోసో

దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్‌-2023 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. రజత్‌కు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటాము. ఇక పాటిదార్‌ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్‌, మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయించలేదు అని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది.

అత్యంత తక్కువ ధరకు కొన్నారు, అయినా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు, వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పిన లక్నో స్టార్ కైల్‌ మైర్స్‌

కాగా గతేడాది జరిగిన మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పాటిదార్‌ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అయితే తనకు వచ్చి అవకాశాన్ని పాటిదార్‌ అందిపుచ్చుకున్నాడు. గతేడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై అద్భుతమైన సెంచరీ బాదాడు. గతేడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్‌.. 333 పరుగులు సాధించాడు.