RCB vs KKR Stat Highlights: అదేం బాదుడయ్యా డివిలియర్స్, కోలకతాను ఉతికేసిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, 82 పరుగుల తేడాతో భారీ విజయం, మూడో ఓటమితో నిలిచిన కేకేఆర్
కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఏబీ డివిలియర్స్ (AB de Villiers) కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన పడగా, విరాట్ కోహ్లీ (Virat Kohli) నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితమై సహచరుడికి పూర్తి సహకారం అందించండం.. ఇక బౌలర్లు సమిష్టిగా కదం తొక్కడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్భుత విక్టరీ నమోదు చేసింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RCB vs KKR Stat Highlights IPL 2020) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఏబీ డివిలియర్స్ (AB de Villiers) కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన పడగా, విరాట్ కోహ్లీ (Virat Kohli) నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితమై సహచరుడికి పూర్తి సహకారం అందించండం.. ఇక బౌలర్లు సమిష్టిగా కదం తొక్కడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్భుత విక్టరీ నమోదు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో అదృష్టం తోడై గట్టెక్కిన కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) ఈసారి మాత్రం ఓటమి వైపు నిలిచింది. ఇది ఆర్సీబీకి ఐదో విజయం కాగా, కేకేఆర్‌కు మూడో ఓటమి.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటింగ్‌నే ఎంచుకుంది. ఆరంభ మూడు ఓవర్లలో ఓపెనర్లు ఫించ్, దేవ్‌దత్ బౌండరీలతో జోరు చూపినా ఆ తర్వాత నెమ్మదించడంతో పవర్‌ప్లేలో 47 పరుగులే వచ్చాయి. ఇక ఎనిమిదో ఓవర్‌లో దేవ్‌దత్‌ను రస్సెల్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఫించ్, కోహ్లీలను పేసర్ నాగర్‌కోటి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా నిలువరించారు. దీంతో 9-15 ఓవర్ల మధ్య 42 రన్స్ మాత్రమే వచ్చాయి. దీనికి తోడు 13వ ఓవర్‌లో ఫించ్‌ను ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ, డివిల్లీర్స్ కొద్దిసేపు తడబడ్డారు.
అప్పటిదాకా చప్పగా సాగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను చివరి ఐదు ఓవర్లలో డివిల్లీర్స్ ఉరకలెత్తించాడు. దీంతో 30 బంతుల్లోనే 83 పరుగులు నమోదయ్యాయి. స్ట్రయికింగ్ ఎక్కువగా తనే తీసుకున్న ఏబీ ముందుగా 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఒత్తిడిని తగ్గించాడు. ఇందులో ఓ సిక్సర్ అయితే ఏకంగా రోడ్డుపై వెళుతున్న కారుకు తగలడం గమనార్హం. ఈ దెబ్బకు నాగర్‌కోటి తొలి మూడు ఓవర్లలో 18 పరుగులిస్తే.. ఈ ఒక్క ఓవర్‌లోనే మరో 18 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆ తర్వాత 17వ ఓవర్‌లో కమిన్స్‌ను వదలకుండా 6,4,6తో 19 రన్స్ రాబట్టాడు. మరుసటి ఓవర్‌లో వరుసగా 4,6 బాదిన డివిల్లీర్స్ 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో కోహ్లీ 12 పరుగులే చేసినా చివరి ఓవర్‌లో ఏబీ 6,4,4తో స్కోరు 200 సమీపానికి చేరింది. అటు 47 బంతుల్లోనే మూడో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు జత చేరాయి. కోల్‌కతా ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌లో ఛేదించే క్రమంలో కేకేఆర్ (Kolkata Knight Riders) పూర్తిగా తేలిపోయింది. శుబ్‌మన్ గిల్(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించింది.
కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. వాషింగ్టన్ సుందర్, మోరిస్‌లకు తలో రెండు వికెట్లు సాధించగా, చహల్, ఉదాన, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు ఒక్కో వికెట్ దక్కింది. సుందర్ నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులే ఇవ్వగా, చహల్ నాలుగు ఓవర్లకు 12 పరుగులిచ్చాడు. మోరిస్ నాలుగు ఓవర్లకు 17 పరుగులివ్వగా, సైనీ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చాడు.
స్కోరు బోర్డు
బెంగుళూరు: ఫించ్ (బి) ప్రసిద్ధ్ కృష్ణ 46, పడిక్కల్ (బి) రస్సెల్ 32, కోహ్లీ (నాటౌట్) 33, డివిలియర్స్ (నాటౌట్) 73, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 194/2. వికెట్ల పతనం: 1-67, 2- 94, బౌలింగ్: కమిన్స్ 4-0-38-0, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-42-1, రస్సెల్ 4-0-51-1, వరుణ్ 4-0-25-0, నాగర్‌కోటి 4-0-36-0.
కోల్‌కతా: బాంటన్ (బి) సైనీ 8, గిల్ (రనౌట్) 34, రాణా (బి) సుందర్ 9, మోర్గాన్ (సి) ఉడాన (బి) సుందర్ 8, కార్తీక్ (బి) చాహల్ 1, రస్సెల్ (సి) సిరాజ్ (బి) ఉడాన 16, త్రిపాఠి (సి) మోరిస్ (బి) సిరాజ్ 16, కమిన్స్ (సి) పడిక్కల్ (బి) మోరిస్ 1, నాగర్‌కోటి (బి) మోరిస్ 4, వరుణ్ (నాటౌట్) 7, ప్రసిద్ధ్ కృష్ణ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 112/9. వికెట్ల పతనం: 1-23, 2-51, 3-55, 4-62, 5-64, 6-85, 7-89, 8-99, 9-108, బౌలింగ్: మోరిస్ 4-0-17-2, సైనీ 3-0-17-1, సిరాజ్ 3-0-24-1, సుందర్ 4-0-20-2, చాహల్ 4-0-12-1, ఉడాన 2-0-19-1.