SRH vs RR Stat Highlights: తెవాటియా దూకుడు, సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయం, హైదరాబాద్‌ను గట్టెక్కించలేకపోయిన వార్నర్, మనీశ్‌ల అద్బుత బ్యాటింగ్
Rahul Tewatia Shines (Photo Credits: Twitter / Rajasthan Royals)

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో (SRH vs RR Stat Highlights Dream11 IPL 2020) రాయల్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (Sunrisers Hyderabad vs Rajasthan Royals) తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీష్ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54), కెప్టెన్ వార్నర్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. బెయిర్‌స్టో 16, విలియమ్సన్ 22, ప్రియంగార్గ్ 15 పరుగులు చేశారు.

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ ఆదిలోనే ప్రధానమైన వికెట్లను చేజార్చుకుంది. 26 పరుగులకే బెన్‌స్టోక్స్ (5), స్టీవ్ స్మిత్ (5), జోస్ బట్లర్ (16) వంటి టాప్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ శిబిరం ఆశలు వదిలేసుకుంది. ఆదుకుంటాడనుకున్న సంజు శాంసన్ (26), రాబిన్ ఉతప్ప (18) కూడా తీవ్రంగా నిరాశ పరచడంతో ఉన్న కొద్దిపాటి ఆశలు అడుగంటాయి.

వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై, మూడు మ్యాచుల తరువాత పరాజయాన్ని చవిచూసిన ఢిల్లీ, ఒంటరి పోరాటంతో ఢిల్లీని గెలిపించలేకపోయిన శిఖర్ ధావన్

తరువాత క్రీజులోకి వచ్చిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ తెవటియా (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

స్కోరు వివరాలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) ఆర్చర్‌ 48; బెయిర్‌స్టో (సి) సామ్సన్‌ (బి) త్యాగి 16; మనీశ్‌ (సి) తేవటియా (బి) ఉనాద్కట్‌ 54; విలియమ్సన్‌ (నాటౌట్‌) 22; ప్రియమ్‌ గార్గ్‌ (రనౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 158.

వికెట్ల పతనం: 1–23, 2–96, 3–122, 4–158.బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–25–1, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–31–0, కార్తీక్‌ త్యాగి 3–0–29–1, ఉనాద్కట్‌ 4–0–31–1, తేవటియా 4–0–35–0, బెన్‌స్టోక్స్‌ 1–0–7–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 5; బట్లర్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్‌ అహ్మద్‌ 16; స్మిత్‌ (రనౌట్‌) 5; సంజూ సామ్సన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ ఖాన్‌ 26; ఉతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 18; రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 42; రాహుల్‌ తేవటియా (నాటౌట్‌) 45; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 163.

వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–63, 5–78.బౌలింగ్‌: సందీప్‌ 4–0–32–0, అహ్మద్‌ 3.5–0–37–2, నటరాజన్‌ 4–1–32–0, అభిషేక్‌ శర్మ 1–0–11–0, రషీద్‌ ఖాన్‌ 4–0–25–2, విజయ్‌ శంకర్‌ 3–0–22–0.