Shubman Gill New World Record: రికార్డులు బద్దలు కొట్టిన శుభమన్ గిల్, అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తిచేసిన గిల్, అంతకుముందు ఈ ఘటన సాధించిన టీమిండియా ప్లేయర్లు ఎవరంటే?

ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

Shubman Gill (Photo-Twitter/BCCI)

New Delhi, OCT 22: వ‌న్డేల్లో శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో (New Zeland) జ‌రుగుతున్న మ్యాచ్‌లో కివీస్ పేస‌ర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్ట‌డంతో అత‌డు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తంగా 31 బంతుల‌ను ఎదుర్కొని 5 ఫోర్ల‌తో 26 ప‌రుగులు సాధించాడు. శుభ్‌మ‌న్ గిల్ 38 ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల ప‌రుగులను పూర్తి చేయ‌గా, ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డానికి హషీమ్ ఆమ్లాకు 40 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం అయ్యాయి. వీరిద్ద‌రి త‌రువాతి స్థానంలో పాకిస్తాన్ లెజెండ్ జహీర్ అబ్బాస్ ఉన్నాడు. అబ్బాస్ 45 ఇన్నింగ్స్‌ల్లో వ‌న్డేల్లో రెండు వేల ప‌రుగులను సాధించాడు.

 

వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2 వేల ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు (త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో)

శుభమన్ గిల్ (భార‌త్‌) – 38 ఇన్నింగ్స్‌ల్లో

హషీమ్ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా) – 40 ఇన్నింగ్స్‌ల్లో

జహీర్ అబ్బాస్ (పాకిస్థాన్‌) – 45 ఇన్నింగ్స్‌ల్లో

కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్‌) – 45 ఇన్నింగ్స్‌ల్లో

బాబర్ ఆజం (పాకిస్థాన్‌) – 45 ఇన్నింగ్స్‌ల్లో

రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (ద‌క్షిణాప్రికా) – 45 ఇన్నింగ్స్‌ల్లో

Mohmmed Shami Creates History: వన్డేల్లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ, వరల్డ్ కప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదువికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు 

టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో రెండు ప‌రుగులు అత్యంత వేగంగా చేసిన రికార్డు (Shubman Gill Sets New World Record) ఇప్ప‌టి వ‌ర‌కు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించ‌గా తాజాగా గిల్ అత‌డి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వీరిద్ద‌రి త‌రువాత న‌వ్య‌జ్యోత్ సింగ్ సిద్ధూ, సౌర‌వ్ గంగూలీలు చెరో 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు. ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వ‌న్డేల్లో రెండు వేల ప‌రుగులు పూర్తి చేసేందుకు 53 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

శుభమన్ గిల్ – 38 ఇన్నింగ్స్‌ల్లో

న‌వ్య‌జ్యోత్ సింగ్ సిద్ధూ – 52 ఇన్నింగ్స్‌ల్లో

సౌర‌వ్ గంగూలీ – 52 ఇన్నింగ్స్‌ల్లో

విరాట్ కోహ్లీ – 53 ఇన్నింగ్స్‌ల్లో

శుభ్‌మ‌న్ గిల్ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో 38 ఇన్నింగ్స్‌ల్లో 64 స‌గ‌టుతో 2012 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 శ‌త‌కాలు, 10 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.