Unwanted Records in IND Vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ రికార్డుల హోరు, ఈడెన్ గార్డెన్స్ లో పలు రికార్డులను సృష్టించిన టీమిండియా
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్‌తో రాణించి సఫారీలపై ఏకంగా 243 పరుగుల తేడాతో (IND Vs SA) ఘన విజయాన్ని అందుకుంది.
Kolkata, NOV 05: వన్డే వరల్డ్ కప్‌లో (CWC-23) భారత జైత్రయాత్రను కొనసాగిస్తూ ఆదివారం కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా సౌతాఫ్రికాతో (South Africa) ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ సేన దుమ్ముదులిపింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్‌తో రాణించి సఫారీలపై ఏకంగా 243 పరుగుల తేడాతో (IND Vs SA) ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధించడంతో పాటు భారత్ పలు రికార్డులను నమోదుచేసింది. అవేంటంటే.. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకుముందు కూడా ఆ జట్టు.. భారత్ చేతిలోనే ఈ రికార్డును మూటగట్టుకుంది. 2015 వరల్డ్ కప్‌లో భారత్.. సౌతాఫ్రికాపై 130 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తంగా ఈ జాబితాలో శ్రీలంక మొదటిస్థానంలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లోనే టీమిండియా(India).. శ్రీలంకను 302 పరుగుల తేడాతో ఓడించడమే పరుగుల పరంగా అతిపెద్ద విజయం. ప్రపంచకప్‌లో కాకుండా వన్డేలలో ఆ జట్టుకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాభవం. అంతకుముందు 2002లో సౌతాఫ్రికాను పాకిస్తాన్ 182 పరుగుల తేడాతో ఓడించింది.
సౌతాఫ్రికాకు వన్డేలలో ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు ఆ జట్టు 1993లో సిడ్నీ వేదికా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో రెండుసార్లూ 83 పరుగులకే ఆలౌట్ అయింది. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాకు అత్యల్ప స్కోరు 149 (ఆసీస్‌పై) గా ఉంది. భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో సిక్సర్ల హోరుతో అభిమానులను అలరిస్తున్న సౌతాఫ్రికా.. తొలిసారి ఒక్క సిక్సర్ కూడా మ్యాచ్‌ను ముగించడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసినన్ని పరుగులు (101) కూడా సౌతాఫ్రికా టీమ్ మొత్తం (83) చేయలేకపోయింది. ఇది కూడా ఓ రికార్డే. ఒక జట్టులో ఆటగాడు సెంచరీ చేసినప్పుడు ప్రత్యర్థి జట్టు కనీసం అతడి వ్యక్తిగత స్కోరు కంటే తక్కువ చేయడం సౌతాఫ్రికా వన్డే చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు కుమార సంగక్కర.. 2013లో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 163 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన సఫారీలు 140కే ఆలౌట్ అయ్యారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (101 నాటౌట్) వీరోచిత సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (77) సమయోచిత ఇన్నింగ్స్, రోహిత్ శర్మ మెరుపులతో భారత్.. ప్రత్యర్థి ముందు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సఫారీల వెన్ను విరవగా షమీ, కుల్దీప్‌లు సౌతాఫ్రికాను కోలుకోనీయలేదు.