IPL 2022: ఓటమితో ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ 5 వికెట్లతో ఘన విజయం, కదం తొక్కిన లియామ్ లివింగ్ స్టోన్
ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో హైదరాబాద్‌పై గెలిచింది.
ఈ ఏడాది ఐపీఎల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో హైదరాబాద్‌పై గెలిచింది. ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ ఎలెవెన్ ఐదు వికెట్లు కోల్పోయి నిర్దేశిత 160 పరుగులు చేసి విజయ తీరాలకు చేరుకున్నది. లియామ్ లివింగ్ స్టోన్ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. లియామ్ లివింగ్ స్టోన్ 49, శిఖార్ ధావన్ 39, జానీ బెయిర్‌స్టో 23, షారూఖ్‌ఖాన్ 19, జితేన్‌శర్మ 19 పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లు అడపాదడపా వికెట్లు తీస్తున్నా.. పంజాబ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడి మ్యాచ్ ఫలితాన్ని రాబట్టారు. హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖీ రెండు, ఉమ్రాన్ మాలిక్, సుచిత్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు పంజాబ్ ఎలెవెన్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఒక మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అంటే పంజాబ్ గెలవాలంటే 158 పరుగులు చేయాల్సిందే. ఈ మ్యాచ్ ఫలితం ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేయకపోయినా ర్యాంక్‌ల వారీగా ఆయా జట్ల స్థానాల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ 43, రాహుల్ త్రిపాఠి 20, రొమారియో షెఫర్డ్ 28, వాషింగ్టన్ సుందర్ 25, మార్‌క్రమ్ 21 పరుగులతో రాణించారు. వాషింగ్టన్ సుందర్, రొమారియో షెఫర్డ్ కలిసి ఏడో వికెట్ భాగస్వామ్యానికి 57 పరుగులు జత చేశారు. ఇక ప్రియం గార్గ్ 4, నికోలస్ పూరన్ ఐదు పరుగులతో విఫలం అయ్యారు.
రిషబ్ పంత్ బిగ్ మిస్టేక్, ప్లే ఆఫ్స్‌కు ముంబై, ఆదుకున్న ఇషాన్ కిషన్, ఢిల్లీ ఘోర పరాజయం
మధ్యలో, చివరిలో పంజాబ్ బౌలర్ల దాటికి తట్టుకోలేక హైదరాబాద్ స్వల్ప వ్యవధిలో వికెట్ కోల్పోవడంతో భారీ స్కోర్ నమోదు చేయలేక చతికల పడింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్‌ప్రీత్ బార్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరింటిలో విజయం సాధించిన హైదరాబాద్ హైదరాబాద్, పంజాబ్ 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఏడో స్థానంలో పంజాబ్, 8వ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి.