T20 World Cup 2022: మ్యాక్స్‌వెల్ మెరుపులు, ఆప్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్న కంగారులు

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వరా సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది.

Australia Team (Photo-Twitter)

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆప్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వరా సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది. చివర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించినా బంతులు లేకపోవడంతో ఆప్ఘనిస్తాన్ కు ఓటమి తప్పలేదు. నాలుగు పరుగుల తేడాతో ఆసీసీ ఘన విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘ‌న్ జ‌ట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే ఆస్ట్రేలియా ఓపెన‌ర్ గ్రీన్ కేవ‌లం మూడు ప‌రుగుల‌కే నిష్క్ర‌మించాడు. ఆ త‌ర్వాత వార్న‌ర్, మిచెల్ మార్ష‌లు స్కోరు బోర్డును ప‌రుగెత్తించే ప్ర‌య‌త్నం చేశారు. వార్న‌ర్ 25 ర‌న్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మార్ష్ కొంత మెరిపించినా.. అత‌ను కూడా 45 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు.లోయ‌ర్ మిడిల్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ భారీ షాట్ల‌తో అల‌రించాడు.మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో ఆరు బౌండ‌రీలు, రెండు సిక్స‌ర్ల‌తో 54 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హిట్ట‌ర్ స్టోయినిస్ 25 ర‌న్స్ చేశాడు. ఆసీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 168 ర‌న్స్ చేసింది.

సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ ముందడుగు, 35 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను మట్టి కరిపించిన కివీస్

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ఇబ్రహీం జర్దన్‌(26), గుల్బదిన్‌ నయిబ్‌(39) నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో మాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌కు గుల్బదిన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆడమ్‌ జంపా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికే ఇబ్రహీం జర్దన్‌ కూడా క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు.అనంతరం వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆప్ఘన్లకు ఓటమి తప్పలేదు. చివర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించినా బంతులు లేకపోవడంతో ఆప్ఘనిస్తాన్ కు ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది. నాలుగు పరుగుల తేడాతో ఆసీసీ ఘన విజయం సాధించింది.