India vs New Zealand 3rd ODI New Zealand beats India by 5 wickets, sweeps series 3-0 (Photo-IANS)

టీ20 ప్రపంచకప్‌(సూపర్‌-12)లో భాగంగా ఐర్లాండ్‌తో (Ireland) జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుం‍చి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్‌ ముందడుగు వేసింది. గ్రూపు-1 నుం‍చి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు (New Zealand) +2.113 రన్‌ రేట్‌ ఉంది.

ఇక మ్యాచ్‌లో (T20 World Cup 2022) తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ విలియమ్సన్‌ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు అలెన్‌(32), మిచెల్‌(31) పరుగులతో రాణించారు. ఐరీష్‌ బౌలర్లలో లిటిల్‌ మూడు, డెలానీ, అడైర్‌ తలా వికెట్‌ సాధించారు.

వీడియో, ప్రపంచకప్‌ 2022లో అత్యంత భారీ సిక్సర్‌, 106 మీటర్ల దూరం బాదిన పాక్ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌, అవాక్కయి అలా చూస్తుండిపోయిన బౌలర్ ఎంగిడి

186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు స్టిర్లింగ్‌, బాల్బిర్నీ అద్భతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వా‍మ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యక వరుస క్రమంలో ఐర్లాండ్‌ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌, సోధి, సౌథీ తలా వికెట్‌ సాధించారు.