టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతిని ఇఫ్తికార్‌ అహ్మద్‌.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సాగనంపాడు. ఇఫ్తికార్‌ ఈ షాట్‌ ఆడిన విధానాన్ని చూసి బౌలర్‌ ఎంగిడి అవాక్కయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)