ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ సెమీస్‌ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్‌ రవీంద్ర 112 (105) సెంచరీతో ఆకట్టుకోగా లేథమ్‌ 55(76) పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలిప్స్‌ 21 (28), బ్రేస్‌వెల్‌ 11 (13) నాటౌట్‌గా నిలిచారు. కాన్వే 30(45), విలియమ్సన్‌ 5(4) పరుగులు చేయగా.. విల్‌ యంగ్‌ డకౌట్‌ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌, నహీద్‌ రాణా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, రిషాద్‌ హొస్సేన్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. న్యూజిలాండ్‌ విజయంతో.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో గ్రూపు - ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరాయి.

కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనకకి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న న్యూజిలాండ్ స్టార్

India, New Zealand Qualify for ICC Champions Trophy 2025 Semi-Finals

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)