T20 World Cup 2022: టీమిండియాకు సెమీఫైనల్లో ఘోర పరాభవం, భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, ఫైనల్లో అడుగుపెట్టిన బట్లర్ సేన
భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒపెనర్లు చేధించారు. ఆకాశమే హద్దుగా ఇంగ్లండ్ ఒపెనర్లు చెలరేగడంతో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాభాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒపెనర్లు చేధించారు. ఆకాశమే హద్దుగా ఇంగ్లండ్ ఒపెనర్లు చెలరేగడంతో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఓపెన్లర్లు బట్లర్, హేల్స్ అర్థ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. పాక్తిస్తాన్ తో ఆమితూమి తేల్చుకోనుంది. బట్లర్ 80 పరుగులు, హీల్స్ 86 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన ఇండియా 169 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. నాలుగో వికెట్‌కు కోహ్లీ, పాండ్యాలు 61 రన్స్ జోడించారు. కోహ్లీ 50, పాండ్యా 63 రన్స్ చేసి ఔటయ్యారు.