T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం, బంగ్లా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు, లిటన్ దాస్ శ్రమ వృధా, బ్యాటింగ్‌లో మరోసారి దుమ్మురేపిన విరాట్ కోహ్లీ
వరుణుడు బంగ్లాదేశ్ ఆశల మీద నీళ్లు చల్లాడు. వర్షం వల్ల ఆట ఆగిపోవడంతో బంగ్లా బ్యాటర్లలో ఊపు తగ్గింది. దీంతో వర్షం తరువాత ఆట తిరిగి ప్రారంభం కాగానే ఊపు మీదున్న లిటన్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు.
ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై భారత్ విజయం సాధించింది. వరుణుడు బంగ్లాదేశ్ ఆశల మీద నీళ్లు చల్లాడు. వర్షం వల్ల ఆట ఆగిపోవడంతో బంగ్లా బ్యాటర్లలో ఊపు తగ్గింది. దీంతో వర్షం తరువాత ఆట తిరిగి ప్రారంభం కాగానే ఊపు మీదున్న లిటన్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అనంతరం వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు. ఆటను 16 ఓవర్లలో 151 పరుగులుగా కుదించారు. బంగ్లాదేశ్ 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 145 పరుగులు సాధించింది. 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 2) భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 4వ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఔటయ్యాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో యాసిర్ అలీకు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది మూడవ అర్ధ సెంచరీ కావడం విశేషం.
ఒక్క బంతికి 14 పరుగులు పిండిన కెఎల్ రాహుల్, అందులో రెండు సిక్సర్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
టోర్నీలో ఫామ్‌లోలేని ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతను 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్ చేసి ఔటయ్యాడు. సూర్య కుమార్ వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 రన్స్ చేశాడు.చివర్లో అశ్విన్ ఆరు బంతుల్లో 13 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 184 రన్స్ చేసింది.
185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించాడు. 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.అయితే ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. బంగ్లాదేశ్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేన్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉండగా వర్షం వల్ల మ్యాచ్ కాసేపు ఆగింది.
అనంతరం మ్యాచ్ ప్రారంభం కాగా ఆటను 16 ఓవర్లలో 151 పరుగులుగా కుదించారు. బ్యాటింగ్ కు దిగిన బంగ్లా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఊపు మీదున్న లిట్టన్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం మహమ్మద్ షమీ బౌలింగ్ లో నజ్మల్ హొస్సేన్ సూర్యకుమార్ యాదవ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అఫిప్ హుస్సేస్ 3 పరుగులు చేసి హర్షదీప్ బౌలింగ్ లో యాదవ్ చేతికి చిక్కాడు.కాసేపటికే షకీబ్ హాసన్ కూడా హర్షదీప్ బౌలింగ్ లో 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
వెంటనే యాసిర్ ఆలి కూడా పాండ్యా బౌలింగ్ లో హర్షదీప్ చేతికి చిక్కాడు. తరువాత వచ్చిన Mosaddek Hossain పాండ్యా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు అంతగా ప్రభావం చూపకపోవడంతో బంగ్లాదేశ్ 16 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో హర్షదీప్ రెండు, పాండ్యా రెండు, షమీ ఒక వికెట్ తీశారు