KL Rahul (Photo-Twitter/ICC)

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌లో రాహుల్‌ తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సరిగ్గా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే షోరిఫుల్‌ ఇస్లామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో రాహుల్‌ ఒక్క బంతికే 14 పరుగులు బాదడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని లాంగాన్‌ దిశగా భారీ సిక్స్‌ బాదాడు.

భారత బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లా బ్యాటర్ లిటన్‌ దాస్‌, ఏడు ఓవర్లలో 69 పరుగులు సాధించిన బంగ్లాదేశ్, వర్షం వల్ల ఆగిపోయిన మ్యాచ్, మళ్లీ కొనసాగే అవకాశం

అయితే అది నోబాల్‌ అని తేలడంతో ఫ్రీహిట్‌ లభించింది. నోబాల్‌ గనుక బంతి కౌంట్‌ కాదు కాబట్టి.. మొత్తం ఏడు పరుగులు(సిక్స్‌తో కలిపి) వచ్చాయి. మరుసటి బంతి వైడ్‌ వేయడంతో ఫ్రీ హిట్‌ అలానే కంటిన్యూ అయింది. అనంతరం ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకున్న రాహుల్‌ రిస్ట్‌ పవర్‌ ఉపయోగించి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా మరోసారి భారీ సిక్సర్‌ బాదాడు. అలా ఒక్క బంతికే 14 పరుగులు వచ్చాయి.