టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 2) భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. టాస ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 4వ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) ఔటయ్యాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో యాసిర్ అలీకు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది మూడవ అర్ధ సెంచరీ కావడం విశేషం.
టోర్నీలో ఫామ్‌లోలేని ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతను 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్ చేసి ఔటయ్యాడు. సూర్య కుమార్ వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. చివర్లో అశ్విన్ ఆరు బంతుల్లో 13 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 184 రన్స్ చేసింది.
185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నాడు. 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేస్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ 17 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పటికే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్ల ఆట ముగియడంతో వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటించనున్నారు.