T20 World Cup 2022: పొట్టలు వేలాడేసుకుని గ్రౌండ్‌లో ఎలా పరిగెడతారు, పాకిస్తాన్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్‌ (Misbah-Ul-Haq) తమ జట్టును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. గ్రౌండ్‌లో పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శలు గుప్పించాడు.

Misbah-ul-Haq (Photo Credits: Getty Images)

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్బా ఉ​ల్‌ హక్‌ (Misbah-Ul-Haq) తమ జట్టును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. గ్రౌండ్‌లో పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శలు గుప్పించాడు. శరీర కింది భాగంలో అధిక బరువు కారణంగా (Pakistan players for poor fitness) పరుగులు తీసేందుకు వారికి ఒళ్లు సహకరించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తాన్‌ తొలుత ఇంగ్లండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో పాక్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో మాట్లాడిన మిస్బా ఉల్‌ హక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఫిట్‌నెస్‌ టెస్టు అనేది పెద్ద జోక్‌లా తయారైందన్నాడు. అంతర్జాతీయ స్థాయి మాదిరిగానే ప్రమాణాలు నెలకొల్పాలని తాము ఎంతగా చెప్పినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు 36వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మాజీ క్రికెటర్

అప్పుడు మేము ఎంతో శ్రద్ధ తీసుకునేవాళ్లమని ఇప్పుడు ఆటగాళ్ల పొట్టలు బయటికి కనబడుతున్నాయి. ... అధిక బరువు కారణంగా వాళ్లు ఫీల్డ్‌లో పాదరసంలా కదలలేకపోతున్నారు. ఫిట్‌నెస్‌ ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం’’ అని మిస్బా ఉల్‌ హక్‌ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 23న టీమిండియాతో పాక్‌ ప్రపంచకప్‌-2022 టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement