IPL 2022: లక్నోకు గట్టి షాక్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించిన ఐపీఎల్ నిర్వాహకులు, మళ్లీ పునరావృతమైతే రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం
స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి 24 లక్షల రూపాయల మేర ఫైన్ (KL Rahul Handed INR 24 Lakh Fine) విధించారు.
ముంబై ఇండియన్స్‌పై విజయంతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు (Lucknow Super Giants) గట్టి షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి 24 లక్షల రూపాయల మేర ఫైన్ (KL Rahul Handed INR 24 Lakh Fine) విధించారు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌లో నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయకపోవడం లక్నోకు ఇది రెండోసారి. అందుకే సారథి రాహుల్‌కు ఈ మేరకు ఫైన్ పడింది. అతడితో పాటు ఆదివారం నాటి ముంబైతో మ్యాచ్‌లోని లక్నో తుదిజట్టులో గల ఆటగాళ్లందరి ఫీజులో 25 శాతం(6 లక్షలు) మేర కోత విధించారు.
ఇక రాహుల్ జట్టు గనుక మరోసారి ఈ తప్పును పునరావృతం చేస్తే కెప్టెన్ రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. అదే విధంగా తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. ఇక ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత రెండోసారి ఫైన్ బారిన పడిన సారథిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. ముంబై పని అయిపోయినట్లేనా.. 8వ ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేన, 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో, సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్
మ్యాచ్ విషయానికొస్తే ముంబైతో మ్యాచ్‌లో లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. కెప్టెన్ రాహుల్ అద్బుత సెంచరీ(62 బంతుల్లో 103 పరుగులు)తో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ముంబై ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం నమోదు చేసింది.