India Squad for Afghanistan T20Is Announced: భారీ గ్యాప్ తర్వాత టీ -20 టీమ్ లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అప్ఘనిస్తాన్ తో సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన
ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ద్వయాన్ని తిరిగి టీ20ల్లోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
New Delhi, JAN 07: దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఘనవిజయం సాధించి ఫుల్ జోష్ మీదున్న టీమిండియా (Team India).. ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జవనరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో వీరిద్దరూ చివరిగా ఆడారు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ వీరు ఆడే అవకాశం ఉంది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ద్వయాన్ని తిరిగి టీ20ల్లోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్ఘన్ టూర్ కు టీమ్ ఇండియా ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.