IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ

COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది......

COVID 19 Effect, IPL 2020 Postponed | Photo: BCCI

Mumbai, March 13: అందరూ అనుమానిస్తున్నట్లుగానే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడింది. COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

"దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా వైరస్ మరింత విస్తరించకుండా ముందు జాగ్రత్త ఐపిఎల్ 2020 ను ఏప్రిల్ 15, 2020 వరకు నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిర్ణయించింది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బోర్డు తెలిపింది.   ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోయిన మరియు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

ఐపీఎల్ మ్యాచ్ లు బెంగళూరులో జరగడానికి వీల్లేదని అని కర్ణాటక ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముంబైలో మ్యాచ్ లపై నిషేధం విధించింది, తాజాగా దిల్లీ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఆరోగ్య సంక్షోభం కారణంగా దేశరాజధానిలో ఎటువంటి క్రీడా కార్యకలాపాలను అనుమతించబోమని దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీసీసీఐ కూడా ఐపీఎల్ 2020 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని బీసీసీఐ ఇప్పటికే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చేరవేసింది.

Here's  official announcement: 

భారత్ లో ఇప్పటివరకు 70 కి పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి మరియు కర్ణాటకలో గురువారం మొదటి COVID-19 మరణాన్ని నమోదైంది. విదేశీ రాకపోకలపై భారత్ స్వీయ నిర్బంధం విధించుకుంటూ ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఆడే విదేశీ క్రీడాకారులు బిజినెస్ వీసా కేటగిరీల్లోకి వస్తారు. వారికి ఇండియాలోకి అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు జరిపింది. అయితే కేంద్రం అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడినట్లు తెలుస్తుంది.