India Vs Afg: 1020 రోజుల నిరీక్షణ ముగిసింది.. తన 71వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ.. పరుగుల వరదను ఎవరికి అంకితం ఇచ్చాడంటే?
ఆసియా కప్(Asia Cup) సూపర్ 4లో (Super 4) భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విరాట్ 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక శతకాన్ని విరాట్ తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ముద్దుల కూతురు వామికా (Vamika)కు అంకితం (Dedicate) చేశాడు.
Dubai, September 9: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానుల నిరీక్షణ ఫలించింది. చాన్నాళ్ల తర్వాత కోహ్లీ మునపటి ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్(Asia Cup) సూపర్ 4లో (Super 4) భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విరాట్ 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 1020 రోజుల నిరీక్షణ తర్వాత సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్లో ఇది 71వ అంతర్జాతీయ సెంచరీ కాగా.. టీ20 ఫార్మాట్ లో అతనికి ఇదే మొదటిది. ఈ ప్రత్యేక శతకాన్ని విరాట్ తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ముద్దుల కూతురు వామికా (Vamika)కు అంకితం (Dedicate) చేశాడు. కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత అనేక విషయాల్లో భార్య అనుష్క తనకు సహాయపడిందని చెప్పాడు.
కోహ్లి పరుగుల వరద.. టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు.. ఆఫ్ఘాన్ పై భారత్ విజయ దుందుభి
ఎప్పుడు సెంచరీ చేసినా.. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకునే విరాట్ ఈ సారి అందుకు భిన్నంగా ప్రశాంతంగా కనిపించాడు. దీని గురించి అతను స్పందించాడు. ఈ సెంచరీ తనకు దేవుడి నుంచి దక్కిన ఆశీర్వాదంగా భావిస్తున్నానని విరాట్ పేర్కొన్నాడు.