T20 World Cup 2022: చెత్త ఫీల్డింగ్‌తో కొంపలు ముంచారంటూ టీమిండియాపై ట్విట్టర్లో ఫైర్, ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది కోహ్లీ అంటూ నెటిజన్ ట్వీట్

తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది.

Virat Kohli drops a sitter in T20 World Cup match (Photo-Video Grab)

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్‌లు చేసిన విరాట్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా సులభమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన అశ్విన్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ మిడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాక పోవడంతో బంతి నేరుగా విరాట్‌ కోహ్లి చేతికి వెళ్లింది.ఈ క్రమంలో ఈజీ క్యాచ్‌ను విరాట్‌ డ్రాప్‌ చేశాడు. దీంతో ఒక్క సారిగా బౌలర్‌తో పాటు అందరూ షాక్‌కు గురయ్యారు.

నా స్వంత హోటల్ గదిలోనే నాకు రక్షణ లేదు, సంచలన వీడియో షేర్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను అంటూ పోస్ట్

వెంటనే షమీ ఓవర్‌లో మార్‌క్రమ్‌కు మరో అవకాశం కూడా లభించింది. సులభమైన రనౌట్‌ అవకాశాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మిస్‌ చేశాడు.ఇలా రెండు సార్లు బతికిపోయిన మార్‌క్రమ్‌ హాఫ్‌ సెంచరీ సాధించి.. ప్రోటీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా కోహ్లి క్యాచ్‌ డ్రాప్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ నెటిజన్‌ స్పందిస్తే.. "ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది" అని కామెంట్‌ చేశాడు.