Virat Kohli World Record: వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ, స్కోరులో సచిన్ టెండూల్కర్ ను దాటిన కోహ్లీ, పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
క్రికెట్ దిగ్గజం సచిన్ ఆల్ టైం రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను (Virat Kohli rewrites history) సాధించాడు.
New Delhi, FEB 19: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ ఆల్ టైం రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను (Virat Kohli rewrites history) సాధించాడు. మూడో రోజు ఆటలో భాగంగా నాథన్ లయన్ బౌలింగ్‌లో కోహ్లీ ఫోర్ కోట్టి 25 వేల మార్కును అందుకున్నాడు. సచిన్ (Sachin Tendulkar) 577 మ్యాచ్‌లకు 25 వేల రన్స్ చేయగా.. విరాట్ కేవలం 549 మ్యాచ్‌లతో ఈ రికార్డును (world record) చేరుకున్నాడు. సచిన్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ (588 మ్యాచ్ లు), దక్షిణాఫ్రికా ఆటగాడు జకస్ కల్లిస్ (594), శ్రీలంక మాజీ కెప్టెన్‌లు కుమార సంగక్కర (608), మహేల జయవర్దనె (701) ఉన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్‌ను మట్టి కరిపించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. గెలుపు కోసం కేవలం 113 పరుగులు కావాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 26.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ వేగంగా ఆడి 20 బంతుల్లోనే 31 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్‌లో ప్రశంసించారు. యువ ఆటగాడు కే శ్రీకర్ భరత్.. భారత రెండో ఇన్నింగ్స్‌లో రత్నమని కేటీఆర్ అభివర్ణించారు. అదేవిధంగా, ఇవాళ్టి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగుల మైలురాయిని దాటిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. బౌలింగ్‌తో అసీస్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచిన స్పిన్ బౌలర్లను మెచ్చుకున్నారు. స్పిన్నర్ల ఆల్‌రౌండ్ ప్రదర్శన అద్భుతమని మంత్రి కొనియాడారు.