ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సంచలన క్యాచ్‌తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు.గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(81) అద్భుత పోరాటం చేశాడు.ప్రమాదకరంగా మారుతున్న అతడిని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా.. అద్భుత బంతి(45.5 ఓవర్)తో బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బాల్‌ను రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. వాట్ ఏ క్యాచ్ అంటూ రాహుల్‌ను కొనియాడింది.
Here's Video
ICYMI - WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)